'బలగం' షోలను ఆపేసే ఆలోచన లేదు: ప్రెస్ మీట్ లో దిల్ రాజు
- ఊరూరా 'బలగం' ఫ్రీ షోలు
- దిల్ రాజు ఆపేయనున్నాడని ప్రచారం
- ఈ విషయంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన దిల్ రాజు
- జనాలు ఈ సినిమా చూడటమే తనకి కావాల్సిందని స్పష్టత
ఈ విషయంపై దిల్ రాజు కొంతసేపటి క్రితం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. "ఏ రకంగానైనా ఈ సినిమాను జనమంతా చూడాలనేది మా కోరిక. థియేటర్ ద్వారా .. ఓటీటీ ద్వారా .. టీవీల ద్వారా ఈ సినిమా జనంలోకి వెళ్లాలనే అనుకున్నాము. ఇప్పుడు నాలుగో ఆప్షన్ కూడా వచ్చేసింది. ఊరూరా తెరలు కట్టేసి ఈ సినిమాను వేసుకుని చూస్తారని మేము ఊహించలేదు. ఈ సినిమాను ఎక్కడ ప్రదర్శిస్తున్నా ఆపేసే ఉద్దేశం లేదు .. ఓపెన్ గా చెబుతున్నాను ఎక్కడా ఆగదు" అన్నారు.
'బలగం' సినిమా చూసి .. గతంలో విడిపోయిన చాలా కుటుంబాలు కలుసుకుంటూ ఉండటం మాకు ఆనందాన్ని కలిగించే విషయం. ఇంతవరకూ నేను చేసిన 50 సినిమాలలో, ఒక్క 'బొమ్మరిల్లు' ద్వారా కొన్ని ఫ్యామిలీస్ లో మార్పు వచ్చింది. 'బలగం' సినిమాతో అంతకంటే ఎక్కువ కదలిక వచ్చింది. ఈ సినిమాకి ఒక్క నెలలోనే 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం విశేషం. తెలుగు సినిమా చరిత్రలో 'బలగం' సినిమాకి ఒక పేజీ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.