అమ్మకిచ్చిన మాట ఈ సినిమాతో నిలబడుతుంది: 'విరూపాక్ష' ఈవెంట్లో సాయితేజ్!
- సాయితేజ్ హీరోగా చేసిన 'విరూపాక్ష'
- దర్శకుడిగా కార్తీక్ వర్మ దండు
- ఈ సినిమా హైలైట్స్ గురించి ప్రస్తావించిన సాయితేజ్
- ఈ నెల 21వ తేదీన విడుదల కానున్న సినిమా
ఈ వేదికపై సాయితేజ్ మాట్లాడుతూ .. "2018లో సుకుమార్ గారు నా దగ్గరికి ఓక కథను పంపిస్తున్నట్టుగా చెప్పారు. లవ్ స్టోరీ అయ్యుంటుందని అనుకున్నాను. థ్రిల్లర్ అని తెలిసి షాక్ అయ్యాను. కార్తీక్ వర్మ దండు కథని వినిపించిన తరువాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని నాకు అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను" అని అన్నాడు.
కార్తీక్ వర్మ దండు తన తల్లికి చేసిన ప్రామిస్ .. నేను మా అమ్మకి చేసిన ప్రామిస్ ఈ సినిమాతో జరగబోతోంది. స్పెషల్ సెట్స్ .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. టీజర్ కీ .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మరింతగా నమ్మకం ఏర్పడింది. ఈ పాత్రను నేను ఇంత బాగా చేయడానికి ప్రతి ఒక్కరూ నాకు సపోర్టు చేస్తూ వచ్చారు" అని చెప్పుకొచ్చాడు.