పాపం సూర్య... వరుసగా మూడో మ్యాచ్ లోనూ తొలి బంతికే అవుట్
- సూర్యకుమార్ యాదవ్ కు కలిసిరాని అదృష్టం
- చెన్నై మ్యాచ్ లో తొలి బంతికే బౌల్డ్
- గత రెండు మ్యాచ్ ల్లోనూ తొలి బంతికే వెనుదిరిగిన సూర్య
మొదటి వన్డేలో స్టార్క్ బౌలింగ్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రెండో వన్డేలోనూ అచ్చం అదే రీతిలో స్టార్క్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇది కూడా తొలి బంతికే. వరుసగా రెండుసార్లు సున్నాలు చుట్టి గోల్డెన్ డక్ సాధించాడు.
ఇవాళ మూడో మ్యాచ్ లోనూ అందరినీ నివ్వెరపరుస్తూ సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే అవుట్ కాగా, ప్రేక్షకులు ఒక్కసారిగా మూగబోయారు. ఆస్టన్ అగర్ బౌలింగ్ లో అవుటైన సూర్య తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. టీ20 క్రికెట్లో బౌలర్లను ఊచకోత కోస్తూ మిస్టర్ 360గా పేరుగాంచిన సూర్య ఇంత దారుణంగా ఆడుతుండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.