ఈటీవీ (Win)లో ‘పంచతంత్రం’ స్ట్రీమింగ్ .. ఎప్పటి నుంచంటే..!
- ఐదు కథల సమాహారంగా రూపొందిన 'పంచతంత్రం'
- థియేటర్ ఆడియన్స్ నుంచి లభించిన ప్రశంసలు
- ఈ నెల 22వ తేదీ నుంచి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైకి
- ఈటీవీ (Win)లో స్ట్రీమింగ్
గత ఏడాది ‘పంచతంత్రం’ను డిసెంబర్ 9న థియేటర్స్‌లో విడుదల చేశారు. అందులో కాన్సెప్ట్స్, నటీనటుల ప్రతిభ, టెక్నీషియన్స్ టేకింగ్ ఆడియెన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఐదు కథల హృదయ స్పందనగా 'పంచతంత్రం'ను రూపొందించారని క్రిటిక్స్ తమ రివ్యూస్ ద్వారా అభినందించారు.
ప్రేమ, భయం, చావు, నమ్మకం, లక్ష్యాలను సాధించటం అనే అంశాలతో ఐదు వేర్వేరు కథల సమాహారంగా ఈ అంథాలజీని రూపొందించారు. మార్చి 22 నుంచి ఈటీవీ (Win)లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది.