అమెరికాలో రైలు ఢీకొని ఏపీ వ్యక్తి దుర్మరణం
- న్యూజెర్సీలో ఘటన
- రైలు పట్టాలపై నడుస్తుంగా ఢీకొట్టిన రైలు
- మృతి చెందిన దిగాల శ్రీకాంత్
- శ్రీకాంత్ అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి
ఫిబ్రవరి 28న పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా, వాషింగ్టన్ నుంచి బోస్టన్ వెళుతున్న ఆమ్ ట్రాక్ రైలు ఢీకొట్టింది. ప్రిన్స్ టన్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. శ్రీకాంత్ కు భార్య, 10 ఏళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు అమెరికాలోని మిత్రులు నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టారు.