ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు.. విచారణకు హాజరవుతానన్న ఎంపీ
- అవినాశ్ తండ్రి భాస్కరరెడ్డికి కూడా నోటీసులిచ్చిన అధికారులు
- గత రాత్రి పులివెందులలోని ఇంటికి వెళ్లి మరీ నోటీసుల అందజేత
- గతంలోనూ ఇద్దరినీ విచారించిన సీబీఐ
అసలు అవినాశ్ రెడ్డి నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ముందస్తు కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నట్టు సీబీఐకి తెలియజేశారు. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా మరోమారు నోటీసులు జారీ చేశారు. సీబీఐ నోటీసులపై స్పందించిన అవినాశ్ రెడ్డి .. తాను 10న విచారణకు హాజరవుతానని, తన తండ్రి ఈ నెల 12న కడపలో జరిగే విచారణకు హాజరవుతారని పేర్కొన్నారు.