విద్యాసంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడితే శిక్ష తప్పదు: మంత్రి బొత్స
- విజయవాడ లయోలా కాలేజీలో సైన్స్ ఎగ్జిబిషన్
- ప్రారంభించిన మంత్రి బొత్స
- విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పై నిషేధం ఉందని వెల్లడి
- ర్యాగింగ్ పై అవగాహన కల్పించామని వివరణ
ఇక, మరే రాష్ట్రంలో లేని రీతిలో ఏపీ ప్రభుత్వం విద్యారంగంపై శ్రద్ధ చూపుతోందని అన్నారు. విద్యార్థుల మేలు కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు.
విద్యా దీవెన, విద్యా కానుక, ముఖ్యమంత్రి గోరుముద్ద వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఇక, సైన్స్ ఎగ్జిబిషన్ ల ద్వారా విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాలను వెలికితీయాలని ఉపాధ్యాయులకు సూచించారు.