పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేక కష్టాలు పడ్డాను: 'సార్' ఈవెంటులో సాయికుమార్
- ధనుశ్ హీరోగా రూపొందిన 'సార్'
- ముఖ్యమైన పాత్రను పోషించిన సాయికుమార్
- చదువుకోవడానికి కష్టాలు పడ్డానని వెల్లడి
- మాస్టార్లు .. స్టూడెంట్స్ తప్పక చూడాల్సిన సినిమా అని వ్యాఖ్య
త్రివిక్రమ్ .. తమన్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించిన సాయికుమార్ మాట్లాడుతూ .. "నేను కష్టాల్లో పుట్టాను .. కష్టాల్లో పెరిగాను. నేను చదువుకునే రోజుల్లో పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అలాంటి పరిస్థితులను చూడటం వల్లనే ఈ కథకి కనెక్ట్ అయ్యాను" అన్నారు.
"ధనుశ్ చాలా గొప్ప ఆర్టిస్ట్ .. షాట్ రెడీ అనగానే తనలోని నటుడు బయటికి వస్తాడు. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో కథాకథనాలు .. డైలాగ్స్ .. పాటలు .. ఫైట్లు అన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ .. యూత్ తో పాటు, గురువులు .. స్టూడెంట్స్ తప్పక చూడవలసిన సినిమా ఇది" అని చెప్పుకొచ్చారు.