ఘంటసాల చివరి కోరికను నెరవేర్చబోయి ఆమె ప్రాణాలు విడిచిందట!
- ఘంటసాల రెండవ భార్య సరళ
- ఆ దంపతుల సంతానమే రవికుమార్
- ఘంటసాల తీరని కోరిక గురించిన ప్రస్తావన
- కైలాసగిరి దర్శనం చేసుకుని తన తల్లి కన్ను మూసిందని వెల్లడి
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " కైలాసగిరి దర్శనం .. మానస సరోవర యాత్ర చేయాలనేది మా నాన్నగారి కోరిక. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. అందువలన ఆయన కోరికను నెరవేర్చడం కోసం మా అమ్మగారు ఒక బృందంతో కలిసి మానస సరోవర యాత్రకి వెళ్లారు.
" ఆమె కైలాసగిరి దర్శనం చేసుకున్నారు .. మానస సరోవరం చూశారు. ఆ తరువాత తన కోరిక నెరవేరిందని చెప్పేసి అక్కడి నుంచి మాకు కాల్ చేసి చెప్పారు. ఆ సమయంలో ఆమె చాలా ఆనందంగా మాట్లాడారు. ఆ తరువాత అక్కడే వున్న టెంట్ లో ఆమె ప్రాణాలు వదిలారు. అలా అమ్మగారు శివ సాయుజ్యాన్ని పొందారు" అన్ని చెప్పుకొచ్చారు.