ఈ నెల 23న క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం
- మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు
- సునీల్ శెట్టి నివాసం వద్ద నిర్వహణ
- సినీ పరిశ్రమ, క్రికెట్ రంగం నుంచి ప్రముఖులకు ఆహ్వానం
వీరి వివాహం మూడు రోజుల పాటు ఉంటుందని సమాచారం. ఖండాలాలోని (ముంబై సమీప ప్రాంతం) సునీల్ శెట్టి నివాసంలో జరిగే పెళ్లి వేడుకకు ప్రముఖులతో పాటు సన్నిహితులను ఆహ్వానించనున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారని, అతిథుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలిసింది. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, క్రికెట్ రంగం నుంచి ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తదితరులు వివాహ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు. అతియా, రాహుల్ చాలా కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరగడం అభిమానులకు తెలిసిందే. అతియా స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఇందుకు సంబంధించిన అప్ డేట్స్ ను సైతం ఇస్తుంటుంది.