ఆసక్తికరంగా అరవింద్ కృష్ణ 'అండర్ వరల్డ్ బిలియనీర్స్' వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్
- వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రూపొందిన వెబ్ సిరీస్
- దర్శకత్వం వహించిన గగన్ గోపాల్ ముల్క
- షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సిరీస్
అరవింద్ కృష్ణ సరసన రాధిక ప్రీతి హీరోయిన్ గా నటిస్తోంది. మధు సూధన్, జ్యోతి రాయ్, షవర్ అలీ, అలోక్ జైన్, లీనా కపూర్, రవి మల్లిడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఎస్ చిన్నా సంగీతం అందించిన వెబ్ సిరీస్ కు టి. సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, జునైద్ సిద్ధిక్ ఎడిటర్ గా, పైడి రాజు నృత్య దర్శకుడిగా పని చేశారు.