నా అభిమానికదా అని బాబీకి ఛాన్స్ ఇవ్వలేదు: చిరంజీవి
- విశాఖలో జరిగిన 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్
- కథ వినగానే ఓకే చెప్పానన్న చిరూ
- రెండేళ్లుగా బాబీ కష్టం చూశానని వివరణ
- అందరికీ ఈ సినిమా నచ్చుతుందని వ్యాఖ్య
- విశాఖలో ఇల్లు కట్టుకుంటానని వెల్లడి
"ఈ సినిమా చేస్తున్నప్పుడు రోజు రోజుకి బాబీపై ప్రేమ పెరుగుతూ పోయింది. అందుకు కారణం ఆయన కష్టపడిన తీరు. ఈ సినిమాను నేను చూశాను .. ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. బాబీ దర్శకుడు మాత్రమే కాదు, మంచి రచయిత .. స్క్రీన్ ప్లే రైటర్ కూడా. అభిమాని కదా అని నేను సినిమా ఇవ్వలేదు .. ఆయన టాలెంట్ నచ్చి ఈ సినిమాను ఇచ్చాను" అని చెప్పారు.
"ఒక కమర్షియల్ సినిమాకి ఉండవలసిన లక్షణాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా విషయంలో బాబీ నిరంతరం కసరత్తు చేస్తూనే వచ్చాడు. ఎవరైతే వర్క్ ను ప్రేమిస్తారో .. ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో అలాంటివారు నాకు అభిమానులు. రెండేళ్లుగా బాబీ కష్టాన్ని చూస్తూ వచ్చిన నేను ఆయనకి అభిమానినయ్యాను" అంటూ ప్రశంసించారు. చిరంజీవి ఆ మాట అనగానే బాబీ ఆయన పాదాలపై పడిపోయాడు. ఇక త్వరలో తాను విశాఖలో ఇల్లు కట్టుకుంటానని చిరంజీవి ఈ వేదిక ద్వారా చెప్పడం మరో ఆసక్తికరమైన అంశం.