లాజ్ ఏంజెలెస్ లో కొత్త లుక్స్ తో రామ్ చరణ్ తేజ్
- లాస్ ఏంజెలెస్ లో డిన్నర్ పార్టీకి హాజరు
- గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కోసం అమెరికా వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన
- ఈ నెల 11న ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కార్యక్రమం
ఈ పర్యటనలో భాగంగా అవార్డుల కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన ఓ పార్టీలో రామ్ చరణ్ పాల్గొన్నాడు. ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం ఈ నెల 11న బెవెర్లీ హిల్టన్ లో జరగనుంది. త్వరలో తల్లిదండ్రులు కానున్న రామ్ చరణ్, ఉపాసన దీని కోసం ముందుగానే అక్కడకు చేరుకోగా, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి సైతం రానున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా స్క్రీనింగ్ ను అమెరికాలో ఏర్పాటు చేయగా, దీనికి సినిమా బృందం మొత్తం హాజరైంది. ఆస్కార్ 2023 అవార్డులకు సైతం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నామినేషన్ కు అర్హత సాధించడం తెలిసిందే.