'శాకుంతలం' ట్రైలర్ లాంచ్ ఈవెంటు వేదికను ఖరారు చేసిన టీమ్!
- ప్రేమకథా కావ్యంగా రూపొందిన 'శాకుంతలం'
- సమంత జోడీగా దేవ్ మోహన్
- ఈ నెల 9వ తేదీన ట్రైలర్ లాంచ్ ఈవెంట్
- హైదరాబాదులోని పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్ లో జరగనున్న ఫంక్షన్
- ఫిబ్రవరి 17వ తేదీన సినిమా రిలీజ్
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు నిన్న ఒక ప్రకటన చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంటును ఎక్కడ నిర్వహించనున్నారు? ఎన్ని గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు? అనే విషయాలను తాజాగా వెల్లడించారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును హైదరాబాదులోని 'పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్'లో ఉదయం 10:30 గంటలకు జరపనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన వివరాలతో కొత్తగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. శకుంతల - దుష్యంతులుగా నటిస్తున్న సమంత - దేవ్ మోహన్ లపై డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
.