'ప్రత్యర్థి' సినిమాతో టాలీవుడ్ కి మరో కొత్త దర్శకుడు!
- డిఫరెంట్ కంటెంట్ తో రూపొందిన 'ప్రత్యర్థి'
- కథానాయికగా అక్షత పరిచయం
- కీలకమైన పాత్రలో రవివర్మ
- ఈ నెల 6వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఎన్నో ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్న శంకర్ ముడావత్, అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు సంపాదించుకున్నాడు. దేవ కట్టా తెరకెక్కించిన 'ఆటోనగర్ సూర్య' సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన శ్రీకాంత్ నరోజ్ వద్ద అసిస్టెంట్ కెమెరామెన్గాను పనిచేశాడు. ఇలా ఇప్పుడు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు దర్శకుడిగా రాబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాను ఇండస్ట్రీలోని ప్రముఖులకు ప్రత్యేకంగా చూపించారు. సినిమా బాగుందని, కొత్త దర్శకుడైనా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని అభినందించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేట్టుగా ఉందని చెప్పుకొచ్చారు. నిర్మాణం పరంగా ఎక్కడా రాజీపడకుండా సంజయ్ సహ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఈ నెల 6వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమాలో, రవివర్మ .. రోహిత్ బెహల్ .. అక్షత ప్రధానమైన పాత్రలను పోషించారు.