'అన్ స్టాపబుల్ 2'లో ఏ ఎపిసోడ్ ఎప్పుడు చూడొచ్చంటే ..!
- 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై సందడి చేసిన ప్రభాస్
- ఈ నెల 6వ తేదీ నుంచి సెకండ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్
- ఈ నెల 13న 'వీరసింహారెడ్డి' స్పెషల్ ఎపిసోడ్
- ఆ తరువాతనే లైన్లోకి పవన్ ఎపిసోడ్
ఇక క్రితం వారం వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ ఎక్కువమందికి రీచ్ అయింది. ఈ ఎపిసోడ్ ను అందరూ ఎంజాయ్ చేశారు. ప్రభాస్ కి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ ఈ నెల 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ ను బాలయ్య ఏయే ప్రశ్నలు అడగనున్నాడా అనే ఆసక్తితో అభిమానులు ఉన్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన 'వీరసింహారెడ్డి' టీమ్ సభ్యులు ఈ టాక్ షోలో పాల్గొననున్నారు. జనవరి 12వ తేదీనే ఈ సినిమా రిలీజ్ అవుతుందనే సంగతి తెలిసిందే. ఆ తరువాతనే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాలతో కూడిన పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు.