ఆయన నా తమ్ముడయ్యా స్వామీ: వైఎస్ జగన్
- ఎంపీ అవినాశ్ గురించి సీఎం జగన్ కామెంట్
- పులివెందులలో జగన్ కు అర్జీ ఇవ్వబోయిన వ్యక్తి
- అవినాశ్ కు ఇవ్వాలని సూచించిన సీఎం జగన్
సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు వెళ్తుండగా.. ఓ వ్యక్తి అర్జీ ఇవ్వడానికి వచ్చారు. దాంతో జగన్.. అర్జీని పక్కనే ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డికి అందజేయమని సూచించారు. అయినప్పటికీ సదరు వ్యక్తి జగన్ కే ఇవ్వబోతుండగా.. ‘నా తమ్ముడయ్యా స్వామీ.. ఆయన ఎవరో కాదు’ అంటూ అవినాశ్ కే ఇవ్వమన్నారు. అర్జీ తీసుకోవాలని ఎంపీ అవినాశ్ కు సైతం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.