సత్యనారాయణ భౌతికకాయానికి కేసీఆర్ నివాళి.. కొంత కాలం ఇద్దరం కలిసి పని చేశామని వ్యాఖ్య
- సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్
- హీరోలకు ఉన్నంత గ్లామర్ సత్యనారాయణదని కితాబు
- అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారని ప్రశంస
సత్యనారాయణగారు ఎంపీగా పని చేసినప్పుడు అనుభవాలను పంచుకోవడం జరిగిందని, కొంత కాలం తామంతా కలిసి పనిచేశామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ కైకాల వంటి సీనియర్ ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. సత్యనారాయణగారు లేని లోటును ఎవరూ పూడ్చలేరని చెప్పారు. ఆయన పోషించిన పాత్రలను పోషించేందుకు ఆయనకు సమానమైన నటులు ఇప్పుడు లేరని అన్నారు. ఆయన మృతి బాధాకరమని, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.