రాజకీయాల్లో ఎక్కువ కాలం ఇమడలేకపోయిన కైకాల
- ఎన్టీఆర్ తో సాన్నిహిత్యంతో రాజకీయ రంగప్రవేశం
- 1996లో మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నిక
- రెండేళ్లకే రాజకీయాలకు దూరం
యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు వంటి పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కైకాల అడుగు పెట్టారు. దివంగత ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్న ఆయన తెలుగు దేశం పార్టీలో చేరి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు. 1996లో ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. 81 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ కు చెందిన కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ పై ఘన విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత లోక్ సభకు మళ్లీ ఎన్నికలు జరగ్గా మరో పర్యాయం పోటీ చేశారు. కానీ, 1998లో కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, చిత్ర పరిశ్రమతో పాటు ఇటు రాజకీయాల్లోనూ సత్యనారాయణ ఎలాంటి వివాదాల్లో తలదూర్చలేదు.