విజయ్ దేవరకొండపై క్రష్ ఉంది: రాశి ఖన్నా
- బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రాశీ ఖన్నా
- జయప్రద, జయసుధలతో పాటు పాల్గొన్న రాశి
- ప్రోమోను విడుదల చేసిన ఆహా సంస్థ
ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా సంస్థ విడుదల చేసింది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా నుంచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య రాబట్టారు. టాలీవుడ్ హీరోల్లో నీకు ఎవరిపై క్రష్ ఉందని బాలయ్య అడగ్గా... ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ అని రాశి సమాధానం ఇచ్చింది. ఈ ఎపిసోడ్ రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.