రెజీనా కసాండ్రతో సందీప్ కిషన్ ప్రేమాయణం?
- సందీప్, రెజీనా ప్రేమలో ఉన్నారంటూ గతంలోనే వార్తలు
- ఆ వార్తలకు బలాన్ని చేకూర్చిన సందీప్ ట్వీట్
- సన్నిహితంగా ఉన్న ఫొటోను షేర్ చేసిన సందీప్
రెజీనా పుట్టిన రోజు సందర్భంగా సందీప్ ఈ ట్వీట్ చేశాడు. 'హ్యాపీ బర్త్ డే పాప. లవ్యూ. అన్ని విషయాలలో నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. స్టే బ్లెస్డ్' అని సందీప్ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఆమెతో చాలా సన్నిహితంగా ఉన్న ఓ సెల్ఫీ ఫొటోను కూడా షేర్ చేశాడు. దీంతో, వీరి ప్రేమ వ్యవహారం నిజమే అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. వీరిద్దరూ కలిసి 'రారా క్రిష్టయ్య', 'నక్షత్రం' చిత్రాల్లో నటించారు.