‘బాస్ పార్టీ’ పాట మొదట వినగానే చిరు రియాక్షన్ అదుర్స్.. వీడియో ఇదిగో!
- పాటను ట్యూన్ చేసిన తర్వాత చిరు, బాబీ, సుకుమార్ కు వినిపించిన దేవిశ్రీ ప్రసాద్
- చాన్నాళ్ల తర్వాత పూర్తి మాస్ పాత్రలో నటిస్తున్న చిరు
- జనవరి 13న విడుదల కానున్న చిత్రం
తొలుత ఈ మాస్ పాటను ట్యూన్ చేసిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్.. చిరంజీవి, దర్శకుడు బాబీతో పాటు సుకుమార్, చిత్ర నిర్మాతలకు వినిపించారు. ఈ పాట వినగానే అభిమానులను మించిన విధంగా వాళ్లంతా ఫిదా అయ్యారు. తొలిసారి పాట విన్నప్పుడు వారు ఇచ్చిన రియాక్షన్కు సంబంధించి చిత్ర బృందం తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. చిరు పాటను ఆస్వాదిస్తూ, చిన్నపిల్లాడిలా మారిపోయారు. సోఫాలో కూర్చుండే బీట్స్ కు తగ్గట్టు స్టెప్పులు వేశారు. సుకుమార్, బాబీ సైతం పొంగిపోయారు. దేవిశ్రీకి అభినందనలు తెలిపారు.