పులివెందులలో ఓటేసిన షర్మిల తెలంగాణ బిడ్డ ఎలా అవుతుంది?: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
- షర్మిలపై ధ్వజమెత్తిన సుదర్శన్ రెడ్డి
- షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వ్యాఖ్యలు
- లేకపోతే తాము ఆంధ్రలో అడుగుపెడతామని హెచ్చరిక
- షర్మిలను బీజేపీ బాణం అంటున్నారని వ్యంగ్యం
ఒకప్పుడు జగనన్న బాణం అంటున్నారని, ఇప్పుడు బీజేపీ బాణం అంటున్నారని సుదర్శన్ రెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. పులివెందులలో ఓటేసిన షర్మిల తెలంగాణ బిడ్డ ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగన్ ఆంధ్ర బిడ్డ అయితే... షర్మిల తెలంగాణ బిడ్డ అవుతుందా? అని అన్నారు. ఈ మేరకు షర్మిలకు సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.