బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా
- ఉప్పెనతో హిట్ కొట్టిన బుచ్చిబాబు సానా
- ఇప్పుడు రామ్ చరణ్ తో పవర్ ఫుల్ సబ్జెక్టు
- సోషల్ మీడియాలో వెల్లడించిన సుకుమార్
వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తొలి చిత్రంగా ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కూడా ఈ చిత్రంలో భాగస్వాములని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్... శంకర్ దర్శకత్వంలో ఆర్సీ-15ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రాజెక్టును మొదలుపెట్టనున్నారు.