'యశోద'లో రోప్స్ .. డూప్స్ లేకుండా ఫైట్లు చేశాను: సమంత
- 'యశోద'గా కనిపించనున్న సమంత
- సరోగసి నేపథ్యంలో సాగే కథ ఇది
- తనకి డాన్సుల కంటే ఫైట్లే ఇష్టమన్న సమంత
- మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అంటూ వ్యాఖ్య
"సాధారణంగా ఏదైనా ఒక కథ నా దగ్గరకి వచ్చినప్పుడు, నేను చేయగలనా లేదా? అనే ఒక భయం నాకు ఉంటుంది. నేను చేయనని కూడా చెప్పేస్తూ ఉంటాను. ఒకసారి కథ ట్రాక్ ఎక్కిన తరువాత చేస్తూ వెళతాను. ఈ సినిమా విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను .. అందువల్లనే టెన్షన్ పడుతున్నాను కూడా. నా సినిమాలను నేను థియేటర్స్ లోనే చూస్తుంటాను. ప్రేక్షకులతో కలిసి సినిమాలు చూడటంలో కలిగే థ్రిల్ వేరు" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"నాకు డాన్సులు ఇష్టమా? ఫైట్స్ ఇష్టమా? అని అడిగితే, ఫైట్స్ అనే చెబుతాను. నేను ఫైట్స్ బాగా చేయగలుగుతాను అనే విషయం 'యశోద' సినిమాకి ముందు వరకూ నాకు కూడా తెలియదు. రోప్స్ .. డూప్స్ లేకుండా నేను ఫైట్స్ చేశాను. ఈ సినిమా చివర్లో వచ్చే యాక్షన్ సీన్ నాకు బాగా నచ్చిన సీన్. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వలన ఆ యాక్షన్ సీన్ అద్భుతంగా అనిపిస్తుంది. థియేటర్లో చూసినప్పుడే ఈ సినిమా కిక్ ను ఇస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.