ప్రొద్దటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
- పొదుపు మహిళలను మోసగించిన మహిళకు రక్షణ కల్పించారని ప్రవీణ్ పై ఆరోపణలు
- ప్రవీణ్ కుమార్ ఇంటిపై దాడి చేసిన వైసీపీ మహిళా నేతలు
- 2 వారాల క్రితం టీడీపీ నేతను అరెస్ట్ చేసిన పోలీసులు
- ప్రవీణ్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన ప్రొద్దటూరు కోర్టు
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ స్వయంగా కడపకు వెళ్లి జైలులో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్థానిక ప్రొద్దటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు.... బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రవీణ్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.