అక్షయ్ ‘రామ్ సేతు’ అదే జోరు.. రెండో రోజూ భారీ వసూళ్లు
- మంగళవారం విడుదలైన ‘రామ్ సేతు’ చిత్రం
- తొలి రోజు రూ. 15.25 కోట్లు వసూలు
- రెండో రోజు మరో పదిన్నర కోట్ల కలెక్షన్
దాంతో, వరుస పరాజయాల తర్వాత అక్షయ కుమార్ ఎట్టకేలకు విజయం సొంతం చేసుకున్నాడు. వారాంతంలోకి వెళ్తే ‘రామ్ సేతు’ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన 'రామ్ సేతు' చిత్రంలో అక్షయ్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భారుచాతో పాటు తెలుగు యువ నటుడు సత్యదేవ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇది యాక్షన్-అడ్వెంచర్ డ్రామా. రామసేతు పురాణమా లేదా వాస్తవమా? అనే విషయాన్ని పరిశోధించే పురావస్తు శాస్త్రజ్ఞుడి పాత్రలో అక్షయ్ నటించారు. ఈ చిత్రాన్ని అక్షయ్‌కి చెందిన కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, అబుందాంటియా ఎంటర్టైన్మెంట్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.