నాన్నగారు అందుకున్న 'కలెక్షన్ కింగ్' బిరుదుకి నేను అర్హుడిని కాదు: మంచు విష్ణు
- 'జిన్నా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు
- తాజా ఇంటర్వ్యూలో మోహన్ బాబు ప్రస్తావన
- తండ్రి ఇండస్ట్రీ హిట్స్ గురించి మాట్లాడిన విష్ణు
- ఆయనతో పోల్చుకోలేమంటూ వెల్లడి
"నాన్నగారి వారసులుగా వచ్చాము కనుక ఆయనతో పోల్చుతూనే ఉంటారు. కానీ అలా పోల్చుకుంటే ఆయనకంటే మేము ఎప్పుడూ తక్కువగానే ఉంటాము. ఆయన ఇంతవరకూ చేసిన విభిన్నమైన పాత్రలలో నేను రెండు .. మూడు కూడా చేయలేదు. అలాంటి అవకాశాలు ఎప్ప్పుడు వస్తాయా అనే ఎదురుచూస్తున్నాను" అని చెప్పాడు.
"మా నాన్నగారు చూసిన విజయాలను మేము ఇంకా చూడలేదు. నేను చేసిన వాటిలో 'దేనికైనా రెడీ' .. 'దూసుకెళతా' వంటి రెండు మూడు సినిమాలు 30 .. 40 కోట్ల వరకూ రాబట్టాయేమో. అదే నాన్నగారి విషయానికి వస్తే ఎనిమిది .. తొమ్మిది ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. ఆయన చేసిన పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన కలెక్షన్ కింగ్ బిరుదును తీసుకునేందుకు నేనింకా అర్హుడిని కాదు .. భవిష్యత్తులో వస్తుందేమో తెలియదు" అంటూ చెప్పుకొచ్చాడు.