తమిళనాట మరో రికార్డును సెట్ చేసిన 'పొన్నియిన్ సెల్వన్'
- మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'పొన్నియిన్ సెల్వన్'
- క్రితం నెల 30వ తేదీన విడుదలైన సినిమా
- ఒక్క తమిళనాడులోనే 200 కోట్ల వసూళ్లు
- అసలు కథంతా సెకండు పార్టులోనే
- ఆ సినిమా వసూళ్లపై అప్పుడే అంచనాలు
తాజా వసూళ్లతో ఈ సినిమా కేవలం తమిళనాడులో మాత్రమే 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే 200 కోట్లను వసూలు చేసిన తొలి కోలీవుడ్ మూవీ ఇదేనని అంటున్నారు. అలాంటి ఒక అరుదైన రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుందని చెబుతున్నారు. మొత్తానికి మణిరత్నం ఎప్పటిలా నవ్వుతూనే సైలెంట్ గా వసూళ్ల సునామీని సృష్టించాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఇది చాలా విస్తారమైన కథ. అందువల్లనే రెండు భాగాలుగా తీస్తున్నారు. ఫస్టు పార్టులో చాలా కథ నడచిన తరువాతగాని, అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాదు. పైగా కొన్ని ఫ్లాష్ బ్యాక్ లు సెకండ్ పార్టులో రివీల్ కానున్నాయి. అసలు కథ అంతా కూడా సెకండు పార్టులోనే ఉంటుంది. అందువలన సెకండు పార్టు ఇంతకు మించిన వసూళ్లను సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.