'అహింస' నుంచి కమ్మగుంటదే పిల్లా సాంగ్ ప్రోమో రిలీజ్!
- తేజ మరో ప్రేమకథగా 'అహింస'
- హీరోగా అభిరామ్ పరిచయం
- హీరోయిన్ గీతికకి కూడా ఇదే ఫస్టు మూవీ
- సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ
- పూర్తి పాట నాని చేతుల మీదుగా 15వ తేదీన విడుదల
ఈ సినిమాలో అభిరామ్ జోడీగా గీతిక తివారి కథానాయికగా నటించగా, రజత్ బేడీ కీలకమైన పాత్రను పోషించింది. చాలా కాలంగా సంగీత దర్శకుడిగా దూరంగా ఉంటూ వచ్చిన ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'కమ్మగుంటదే పిల్లా' సాంగ్ ప్రోమోను వదిలారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. హీరో హీరోయిన్ పై చిత్రీకరించబడిన ఈ పాట బాగుంది. చంద్రబోస్ అందించిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాటను హీరో నాని చేతుల మీదుగా ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు.