ఎన్టీఆర్ జోడీగా సందడికి సై అనేసిన శ్రీలీల!
- శ్రీలీల తాజా చిత్రంగా రానున్న 'ధడాక'
- నితిన్ జోడీ కడుతున్న భామ
- రీసెంట్ గా రామ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్
- కొరటాల సినిమాకి ఓకే చెప్పిందంటూ టాక్
ఈ సినిమా కోసం ముందుగా అలియా భట్ పేరు వినిపించినప్పటికీ, ఆ తరువాత పూజ హెగ్డే .. రష్మిక .. కియారా అద్వాని పేర్లు తెరపైకి వచ్చాయి. మొదటి కథానాయికగా ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక రెండవ కథానాయికగా శ్రీలీలను తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైందనే అంటున్నారు.
'పెళ్లి సందD' సినిమాతో పరిచయమైన ఈ భామ, త్వరలో 'ధమాకా'తో పలకరించనుంది. బాలకృష్ణ .. నితిన్ సినిమాలలోను కనిపించనుంది. రీసెంట్ గా రామ్ - బోయపాటి సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.