మనుగోడు ఉప ఎన్నికలో బీఎస్పీ అభ్యర్థిగా అందోజు శంకరాచారి
- బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకరాచారి
- మునుగోడులో బీసీల ఓట్లే ఎక్కువ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకే టికెట్ ఇస్తున్నట్టు వెల్లడి
- శంకరాచారికి బీఫామ్ అందించిన ప్రవీణ్
మునుగోడు అసెంబ్లీలో అత్యధిక సంఖ్యలో బీసీల ఓట్లే ఉన్నాయని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్న ప్రవీణ్ కుమార్.. ఆ సామాజిక వర్గానికి ఇప్పటిదాకా ఏ ఒక్క పార్టీ కూడా పోటీ చేసే అవకాశమే ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా సాగుతున్న బీఎస్పీ మాత్రం మునుగోడులో బీసీలకు టికెట్ ఇస్తుందని కూడా ప్రవీణ్ ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే శంకరాచారికి బీఎస్పీ టికెట్ ప్రకటించారు.