కొత్త రికార్డులు నమోదు చేస్తున్న 'పొన్నియిన్ సెల్వన్'
- సెప్టెంబర్ 30న విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్'
- మణిరత్నం నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ
- టాలీవుడ్ లో దక్కని ఆదరణ
- కోలీవుడ్ లో కొత్త రికార్డుల నమోదు
- ఓవర్సీస్ లోను భారీ వసూళ్ల జోరు
తెలుగులో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదుగానీ, తమిళంలో మాత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తమిళ వెర్షన్ లో 'బాహుబలి' పేరుతో ఉన్న రికార్డును ఈ సినిమా అధిగమించింది. ఇక ఇటీవల కాలంలో 'విక్రమ్' సినిమాతో కమల్ సెట్ చేసిన రికార్డును అధిగమించడానికి కూడా ఎన్నో రోజులు పట్టదని విశ్లేషకులు చెబుతున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా '2.0' పేరుతో ఉన్న రికార్డును తుడిచేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇలా కోలీవుడ్ లో ఈ సినిమా కొత్త రికార్డులను నెలకొల్పుతూ ముందుకు వెళుతోంది. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. తమిళంలో ఈ సినిమాకి జనాలు పడుతున్న నీరాజనాల కారణంగా, త్వరలోనే పార్టు 2 కూడా సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తానికి మణిరత్నం ఒక తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్టే అనుకోవాలి.