ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే: నాగబాబు
- అలయ్ బలయ్‌లో చిరుపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి
- గరికపాటిపై వ్యంగ్యాత్మక పోస్ట్‌ను సంధించిన నాగబాబు
- సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన నాగబాబు పోస్ట్
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే.. అంటూ నాగబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన సోదరుడికి దక్కిన ఇమేజీని చూసి గరికపాటి అసూయపడ్డారనే అర్థం వచ్చేలా నాగబాబు సెటైరిక్ పోస్ట్‌ను ప్రయోగించారు. అయితే ఈ పోస్ట్ లో గరికపాటి పేరును నాగబాబు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చ సాగుతోంది.