ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'ఆదిపురుష్'లో రాముడిగా ఫస్ట్ లుక్ వచ్చేసింది!
- ఈ ఉదయం ట్విట్టర్ లో రిలీజ్ చేసిన దర్శకుడు ఓం రౌత్
- ఆకాశానికి విల్లు ఎక్కు పెట్టి పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్
- ఆదివారం ఆయోధ్యలో టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ఓం రౌత్ ప్రకటన
ఆదివారం రాత్రి 7.11 గంటలకు టీజర్ విడుదల అవుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సీతాదేవిగా కృతి సనన్ నటించింది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన పది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.