ఆ రోజున కర్నూలులో స్క్రీన్లు చిరిగిపోవడం పక్కా: చైతూ
- నాగ్ హీరోగా రూపొందిన 'ది ఘోస్ట్'
- దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు
- సంగీత దర్శకుడిగా మార్క్ కె రాబిన్
- అక్టోబర్ 5వ తేదీన విడుదల
నాగార్జునతో పాటు చైతూ .. అఖిల్ ఇద్దరూ కూడా ఈ వేడుకకి వచ్చారు. చైతూ మాట్లాడుతూ .. "నాన్నతో .. అఖిల్ తో కలిసి ఫస్టు టైమ్ కర్నూలు రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక మాస్ సినిమా పడితే సౌండ్ ఎలా ఉంటుందనేది మాకు హైదరాబాదులో తెలుస్తుంది. దానికి సంబంధించిన టేస్టు కొంచెం ఇక్కడ మాకు దొరికింది. ఈ మధ్య కాలంలో నాన్నను ఎప్పుడు కలిసినా ఈ సినిమాను గురించే మాట్లాడుతూ వచ్చారు.
ఇంతకు ముందెప్పుడూ నాన్నలో ఇంతటి ఎగ్జైట్ మెంట్ చూడలేదు. నాన్నని ఎలా చూడాలని అనుకున్నానో అలాగే చూపించిన ప్రవీణ్ సత్తారుకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఆయన ఒక పెర్ఫెక్ట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేసే పద్ధతి నాకు నచ్చుతుంది. అక్టోబర్ 5న కర్నూలులో స్క్రీన్స్ చిరిగిపోవడం ఖాయం అనుకుంటున్నాను. ఆ తరువాత తమ్ముడు 'ఏజెంట్' గా వచ్చి థియేటర్లను బద్దలు కొట్టేస్తాడు" అంటూ చెప్పుకొచ్చాడు.