విలన్ గ్యాంగును ఓ పట్టు పడుతున్న మహేశ్ బాబు!
- సెట్స్ పైకి వెళ్లిన మహేశ్ బాబు 28వ సినిమా
- కొన్ని రోజులుగా జరుగుతున్న షూటింగ్
- మహేశ్ తో రెండోసారి జోడీకట్టిన పూజ హెగ్డే
- వచ్చే వేసవిలో రిలీజ్ చేసే ఆలోచన
ప్రస్తుతం అక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నారట. విలన్ గ్యాంగ్ భరతం పట్టే ఈ సన్నివేశంలో మహేశ్ బాబు విజృంభిస్తున్నాడని అంటున్నారు. మహేశ్ బాబు తదితరులు ఈ సన్నివేశంలో పాల్గొంటున్నట్టుగా చెబుతున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయించినట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మహర్షి' వచ్చిన సంగతి తెలిసిందే. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మహేశ్ బాబు ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయి.