చలమల కృష్ణారెడ్డితో కలిసి రేవంత్‌తో భేటీ అయిన పాల్వాయి స్రవంతి
- మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఎంపిక
- టికెట్ కోసం స్రవంతితో పోటీ పడిన చలమల కృష్ణారెడ్డి
- ఇద్దరూ కలిసి రేవంత్‌తో భేటీ అయిన వైనం
ఇందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శనివారం హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె వెంట టికెట్ కోసం తీవ్రంగా యత్నించిన చలమల కృష్ణారెడ్డి కూడా రేవంత్ వద్దకు వచ్చారు. టికెట్ ఖరారైన నేపథ్యంలో విభేదాలు వీడి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం.