చిన్నప్పటి నుంచి డాక్టర్ అయ్యేదాకా.. చేతిరాతపై ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వైరల్ వీడియో ఇదిగో
- పదో తరగతిలో చేతిరాత ఎలా ఉంటుందనే దానితో మొదలు
- డాక్టర్, ఆ పైస్థాయి చదువుకు వెళ్లే సరికి ఎలా మారుతుందనే దానిపై వీడియో
- ఇది నిజమేనంటూ చాలా మంది కామెంట్లు
డాక్టర్ల చేతిరాత ఇలా ఉంటుందంటూ..
- డాక్టర్ల చేతిరాత ఇలా ఉంటుందంటూ రూపొందించిన ఈ వీడియోలో.. పదో తరగతి, తర్వాత ఇంటర్మీడియట్ స్థాయి, ఎంబీబీఎస్, పీజీ చదివే వరకు చేతిరాతను చూపించారు. మొదట చాలా నీట్ గా ఉన్న చేతిరాత కొద్దికొద్దిగా మారిపోతూ వచ్చింది.
- ఆ తర్వాత జూనియర్ డాక్టర్, సీనియర్ డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్ దాకా చేతిరాతను చూస్తే.. నవ్వు ఆపుకోలేం. ఆనంద్ మహీంద్రా కూడా.. ‘ఇదెంతో సరదాగా ఉంది. కానీ నిజమే..’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టడం గమనార్హం.
- ఆనంద్ మహీంద్రా పెట్టిన ఈ వీడియో ఎంత వైరల్ గా మారిందంటే.. రెండు రోజుల్లోనే 19 లక్షల మందికిపైగా దీనిని వీక్షించారు. 57 వేలకుపైగా లైకులు, 8 వేల వరకు రీట్వీట్లు రావడం గమనార్హం.
- ‘ఇది నిజమే మరి. ఎందుకో ఇలా’ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. కేవలం మందుల దుకాణం వాళ్లకే అర్థమయ్యేందుకే అలా రాస్తుంటారని మరికొందరు పేర్కొంటున్నారు. మొత్తంగా ఇదైతే సరదాగా అనిపించే వాస్తవం అంటూ కామెంట్లు పెడుతున్నారు.