అమెరికాలో ఏ తెలుగు సినిమా సాధించని రికార్డును సొంతం చేసుకున్న 'కార్తికేయ 2'
- నిఖిల్ కెరీర్లో అతిపెద్ద హిట్ గా నిలిచిన 'కార్తికేయ 2'
- అమెరికాలో ఇప్పటివరకు 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్
- నాలుగో వారంలో 80కి పైగా లొకేషన్లలో రన్ అవుతున్న తొలి చిత్రంగా గుర్తింపు
మరోవైపు, అమెరికాలో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో 1.5 మిలియన్ డాలర్లను సాధించింది. అంతేకాదు... నాలుగో వారంలో కూడా 80కి పైగా లొకేషన్లలో రన్ అవుతున్న తొలి తెలుగు చిత్రంగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. గతంలో ఏ తెలుగు సినిమా కూడా ఈ ఘనతను సాధించలేదు. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రను పోషించారు.