తెలంగాణ పర్యటనకు వచ్చిన మరో కేంద్ర మంత్రి
- జహీరాబాద్ పార్లమెంటులో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్
- మహబూబ్ నగర్ పార్లమెంటు పర్యటనకు వచ్చిన మహేంద్రనాథ్ పాండే
- శంషాబాద్‌లో పాండేకు స్వాగతం పలికిన జితేందర్ రెడ్డి
తాజాగా నిర్మల పర్యటన ముగియకముందే మరో కేంద్ర మంత్రి తెలంగాణ పర్యటనకు వచ్చారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా నియమితులైన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. రేపటి నుంచి మహేంద్రనాథ్ పాండే మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో పర్యటించనున్నారు.