క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన ఫెన్సింగ్ క్రీడాకారిణి బేబి రెడ్డి, పారా సైక్లిస్ట్ అర్షద్, కోచ్ ఆదిత్య మెహతా
- క్యాంపు కార్యాలయంలో క్రీడాకారుల సందడి
- సీఎంను కలిసి ఆశీస్సులు అందుకున్న వైనం
- వారు సాధించిన విజయాల పట్ల సీఎం అభినందనలు
సీఎం జగన్ వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. తన ఆశీస్సులు అందించారు. వారు సాధించిన విజయాలు, పతకాల గురించి అడిగి తెలుసుకున్నారు. బేబి రెడ్డి ఇటీవల జరిగిన కామన్వెల్త్ దేశాల ఫెన్సింగ్ చాంపియన్ షిప్ జూనియర్స్ టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. షేక్ అర్షద్ ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ లో రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు.