బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు... సాదరంగా ఆహ్వానించిన జేపీ నడ్డా
- వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా పనిచేసిన ప్రదీప్ రావు
- తగిన గుర్తింపు దక్కలేదంటూ ఇటీవలే టీఆర్ఎస్కు రాజీనామా
- జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన వైనం
తెర ముందు దయాకర్ రావు కనిపిస్తున్నా... తెర వెనుక అన్న గెలుపు కోసం తాను ఎంతగానో కష్టపడ్డానని, అయితే తనకు తగిన రీతిలో గుర్తింపు దక్కని కారణంగా తాను టీఆర్ఎస్ ను వీడుతున్నట్లుగా ఇటీవలే ప్రదీప్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రదీప్రావు పార్టీని వీడకుండా ఉండేలా టీఆర్ఎస్ సాగించిన రాయబారం పని చేయలేదు. గతంలో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ప్రదీప్ రావు పనిచేశారు.