మెగాస్టార్ కీ .. రాజమౌళికి థ్యాంక్స్: మణిరత్నం
- మణిరత్నం తాజా చిత్రంగా 'పొన్నియిన్ సెల్వన్'
- చారిత్రక నేపథ్యంలో నడిచే కథ
- రెండు భాగాలుగా రానున్న సినిమా
- సెప్టెంబర్ 30వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ వేదికగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈ వేదికపై మణిరత్నం మాట్లాడుతూ .. "ముందుగా రాజమౌళిగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా జానపదాలను చేసి సక్సెస్ ను సాధించవచ్చనే విషయాన్ని ఆయన నిరూపించారు. ఆయన తెరకెక్కించిన 'బాహుబలి' మాదిరిగానే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది.
ఇక ఈ వేదిక ద్వారా చిరంజీవిగారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. ఆయనకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాననేది ఆ తరువాత మీకు తెలుస్తుంది" అన్నారు. 'రాజ రాజ చోళ'కి సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, విక్రమ్ .. కార్తి .. జయం రవి .. శరత్ కుమార్ .. ఐశ్వర్య రాయ్ .. త్రిష .. ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించారు.