'లైగర్' నుంచి కోకా సాంగ్ రిలీజ్!
- 'లైగర్' గా విజయ్ దేవరకొండ
- కథానాయికగా అనన్య పాండే పరిచయం
- మాస్ లుక్ తో కనిపించనున్న రమ్యకృష్ణ
- ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల
'కొనిస్తనే కోకా కోకా కోకా' అంటూ ఈ పాట సాగుతోంది. విజయ్ దేవరకొండ - అనన్య పాండే బృందంపై ఈ పాటను చిత్రీకరించారు. పంజాబీ సాంగ్ తరహాలో.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సాహిత్యంతో ఈ పాట సాగింది. అనన్య పాండే గ్లామర్ టచ్ తో బీట్ ఆకట్టుకునేలా ఉంది.
ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించింది. మకరంద్ దేశ్ పాండే ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో మైక్ టైసన్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.