ఈ ప్రయాణంలో ప్రకృతి పెట్టే పరీక్షలు తప్పవు: 'కార్తికేయ 2' ట్రైలర్ రిలీజ్
- చందూ మొండేటి నుంచి 'కార్తికేయ 2'
- నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్
- ఉత్కంఠను పెంచుతున్న ట్రైలర్
- ఈ నెల 13వ తేదీన సినిమా రిలీజ్
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో ఏదో రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుండటం .. అందుకు కొందరు అడ్డుపడుతుండటం ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ కార్యాన్ని సాధించడానికి తనని శ్రీకృష్ణుడు ఎంచుకున్నాడని భావించిన హీరో అవాంతరాలను ఎదుర్కుంటూ ఉంటాడు.
సముద్రతీరంలో .. మంచు పర్వతాలలో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ముఖ్యమైన పాత్రల్లో ఆదిత్య మీనన్ .. తులసి .. శ్రీనివాస రెడ్డి కనిపించనున్నారు.