మహేశ్ బాబు సినిమా విషయంలో అది పుకారేనట!
- మహేశ్ 28వ సినిమా కోసం సన్నాహాలు
- త్రివిక్రమ్ తో మహేశ్ కి ఇది మూడో సినిమా
- సంగీతాన్ని సమకూర్చుతున్న తమన్
- సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన
ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడనే ప్రచారం కొన్ని రోజులుగా ఊపందుకుంది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదన్నది సన్నిహిత వర్గాల మాట. మహేశ్ బాబు సింగిల్ గానే కనిపిస్తాడనీ .. కాకపోతే మిగతా సినిమాలకి భిన్నంగా కనిపిస్తాడని వాళ్లు అంటున్నారు.
హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికలుగా పూజ హెగ్డే - ప్రియాంక అరుళ్ మోహన్ అలరించనున్నారు. పక్కా ప్లానింగుతో అంతా సిద్ధంగానే ఉండటం వలన, 'సంక్రాంతి'కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.