ఆ కథతో రామ్ ను రంగంలోకి దింపుతున్న దిల్ రాజు?
- బన్నీ ఇక 'ఐకాన్' ప్రాజెక్టు చేయనట్టే
- ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్
- కథానాయికగా తెరపైకి రష్మిక పేరు
- వచ్చే ఏడాదిలో పట్టాలెక్కే అవకాశం
ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి మరో హీరోతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ కథలో హీరో పాత్రకిగల ఎనర్జీకి రామ్ అయితే బాగుంటుందని భావించి ఆయనకి కథ చెప్పారట. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన మార్పులు రామ్ చెప్పడంతో, అందుకు తగినట్టుగా చేయడానికి ఇద్దరూ ఓకే చెప్పారని సమాచారం.
ప్రస్తుతం వేణు శ్రీరామ్ ఆ మార్పులను చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. టైటిల్ కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రామ్ త్వరలో బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ సినిమా షూటింగు పూర్తయిన తరువాత దిల్ రాజు ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది.