ఐశ్వర్య అర్జున్ రెడీ .. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్!
- దర్శకుడిగా అర్జున్ తెలుగు సినిమా
- కూతురు ఐశ్వర్య టాలీవుడ్ కి పరిచయం
- కథానాయకుడిగా విష్వక్సేన్
- సంగీత దర్శకుడిగా రవి బస్రూర్
ఇటీవలే ఈ సినిమా పవన్ కల్యాణ్ క్లాప్ తో లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాలో హీరోగా విష్వక్సేన్ నటించనున్నాడు. ఆయన 'ధమ్కీ' సినిమా షూటింగులో బిజీగా ఉండటం వలన, ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకావడానికి ఆలస్యమైంది.
తాజాగా ఈ సినిమా మ్యూజిక్ సిటింగ్స్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. సాహిత్యాన్ని చంద్రబోస్ అందిస్తున్నారు. అర్జున్ సొంత బ్యానర్లో .. ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.