మెగాస్టార్ చిరంజీవి సమర్పించు ‘లాల్ సింగ్ చడ్డా'
- ఆమిర్ ఖాన్ కొత్త చిత్రం తెలుగు వెర్షన్ కు సమర్పకుడిగా చిరు
- ఆగస్టు 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం
- కీలక పాత్ర పోషించిన అక్కినేని నాగచైతన్య
ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ‘లాల్ సింగ్ చడ్డా’ తెలుగు పోస్టర్ ను శనివారం ఉదయం ట్విట్టర్ లో షేర్ చేశారు. తన సన్నిహిత మిత్రుడు ఆమిర్ ఖాన్ నటించిన ఎమోషనల్ చిత్రం తెలుగు వెర్షన్ ను సమర్పించాడన్ని ప్రత్యేకమైన విశేషంగా భావిస్తున్నానని చెప్పారు. ఆమిర్ ను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అభిప్రాయపడ్డారు.